ది బ్రేకింగ్ న్యూస్ మూవీ డిసెంబర్ 11న విడుదల


తెలుగు సినిమా ‘ది బ్రేకింగ్ న్యూస్’ డిసెంబర్ 11, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత రెడ్డి, ఉమా గుటూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్ కడియాల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మురళీ మోహన్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించగా, సోనియా నాయుడు, ఆర్.కె. నాయుడు, వాసుదేవ్, ప్రేమ్ కృష్ణ, రవి ప్రకాష్, వాహిని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మీడియా రంగం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆసక్తికరమైన థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. వార్తా ప్రపంచంలోని పరిణామాలు, మీడియా నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

ఈ చిత్ర ప్రారంభోత్సవం మరియు ఫస్ట్ లుక్‌ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించగా, నవంబర్ 20న టాలీవుడ్ నటుడు సుమంత్ ట్రైలర్‌ను విడుదల చేశారు. విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటూ, సోషల్ మీడియాలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

ఆసక్తికరమైన కథాంశం, మీడియా నేపథ్యం, ప్రతిభావంతులైన నటీనటులతో రూపొందిన ‘ది బ్రేకింగ్ న్యూస్’ డిసెంబర్ 11, 2026న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

నటీనటులు

మురళీ మోహన్, అనన్య నాగళ్ల, సోనియా నాయుడు, ఆర్.కె. నాయుడు, వాసుదేవ్, ప్రేమ్ కృష్ణ, రవి ప్రకాష్, వాహిని తదితరులు.

సాంకేతిక బృందం

దర్శకత్వం: పవన్ కడియాల
నిర్మాతలు: హనుమంత రెడ్డి, ఉమా గుటూర్
బ్యానర్: ఓపెన్ స్కై క్రియేషన్స్
సంగీత దర్శకుడు: శశి ప్రీతమ్
ఛాయాగ్రహణం: సైనాథ్
ఎడిటర్: శిరీష్ ప్రసాద్
పీఆర్వో: వీరబాబు